నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్

ఎలక్ర్టానిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో సోమవారం (డిసెంబరు 2) ఇంటెల్‌ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందని.. ఇంటెల్ సంస్థ ‘ఎక్సెస్‌ స్కేల్‌ కంప్యూటర్’ అభివృద్ధి పరచడం మనకు గర్వకారణమన్నారు.

Dont Miss:

కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో దాదాపు 1500 మంది ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకుపోతోందని.. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఆఫీస్ స్పేస్ రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి

Read Also:

ఇంటెల్ సంస్థ బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో రెండో కేంద్రాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అదేవిధంగా హార్డ్‌వేర్‌ రంగంలో ఇన్నోవేటర్ల కోసం ఏప్రిల్‌లో ‘టీ వర్క్స్‌’ ఆవిష్కరించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజా కూడా పాల్గొన్నారు.

Read More . . .

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.