నవ భారత నిర్మాణానికి సుప్రీం తీర్పు నాంది: మోదీ

భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం ఇవాళ సంపూర్ణత్వంతో వికసించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీర్ఘకాలిక సమస్యపై సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థలో ఈ రోజు సువర్ణాధ్యాయం మొదలైందన్నారు. దశాబ్దాల పాటు సాగిన న్యాయ ప్రక్రియ ఇవాల్టితో ముగిసిందని పేర్కొన్నారు. అయోధ్య అంశంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం (నవంబర్ 9) చరిత్రాత్మక తీర్పు వెలువరించిన నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు మహోన్నత తీర్పు వెలువరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును దేశమంతా స్వాగతించిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వాదనలను సుప్రీం కోర్టు ఎంతో ఓపిగ్గా ఆలకించిందని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించిందని చెప్పారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.