నడిరోడ్డుపై కత్తులతో వెంటాడి వ్యక్తి దారుణహత్య

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడిన దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. తుమకూరుకు చెందిన సతీశ్ అనే యువకుడిని శుక్రవారం కొందరు దుండగులు నడిరోడ్డుపై వెంబడించారు. కత్తులతో నరుకుతూ సినీఫక్కీలో దారుణంగా నరికారు.

Also Read:

తీవ్ర రక్తస్రావంతో పడివున్న సతీశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తుపట్టే పనిలో పడ్డారు. అతడిని ఎవరు, ఎందుకు చంపారన్న దానిపై స్పష్టత లేదని, సమగ్ర దర్యాప్తు తర్వాతే అసలు నిజాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

Also Read:

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.