నకిలీ టికెట్లతో దోపిడీ.. తాత్కాలిక కండక్టర్ దొరికాడిలా!

ర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం బస్సులు నడిపిస్తుంటే.. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. డిపోలోని అధికారులకు దొంగ లెక్కలు చూపుతూ ఓ తాత్కాలిక కండక్టర్ టిక్కెట్ల ద్వారా వచ్చిన సొమ్మును జేబులో వేసుకుంటున్న వైనం ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. విధులు ముగిసిన తర్వాత డిపోలో డబ్బులు లెక్క చెబుతుండగా జేబులోంచి అదనపు టికెట్లు కింద పడటంతో కండక్టర్ బాగోతం బయటపడింది. ఖమ్మం జిల్లా డిపోలో శనివారం (నవంబర్ 9) రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆర్టీసీ సంస్థ ఇచ్చిన అవకాశం అందుకొని శేఖర్ అనే వ్యక్తి మధిర డిపోలో తాత్కాలిక కండక్టర్‌గా విధులు నిర్వహించడానికి ముందుకొచ్చాడు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రయాణికులకు అసలు టికెట్లకు బదులుగా ఇస్తూ.. ఆ టికెట్ డబ్బులను తన జేబులో వేసుకుంటున్నాడు. ఇలా రోజుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కొల్లగొడుతున్నాడు.

Also Read:

రోజూ మాదిరిగానే శనివారం డ్యూటీ ముగిసిన తర్వాత డిపోలో డబ్బు కడుతుండగా.. శేఖర్ జేబులో నుంచి అదనపు టికెట్లు కిందపడ్డాయి. అది గమనించిన అధికారులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆ టిక్కెట్లు నకిలీవనీ తేలింది. ప్రయాణికులకు ఆ నకిలీ టికెట్లను అంటగట్టి వారిచ్చిన డబ్బును స్వాహా చేస్తున్నట్టు తెలిసింది. డిపో అధికారులు శేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లతో పాటు సూపర్‌వైజర్లు, ఇతర ఉద్యోగులందరూ సమ్మెలోనే ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని తాత్కాలిక సిబ్బంది తమ చేతివాటం చూపుతున్నారు. అయితే.. ఈ అక్రమాలు ప్రభుత్వ అధికారులకు తెలియనివి కావు. వారిని నియంత్రించడానికి ఇప్పటికిప్పుడు సరైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో అధికారులు మిన్నకున్నట్లు వ్యవహరిస్తున్నారు. లాభాలు రాకున్నా సరే.. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని బస్సులు నడిపిస్తున్నారు.

Don’t Miss:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.