ధోనీ వ్యూహంతో భారత్‌ని ఓడించిన బంగ్లా‌దేశ్

టీ20 చరిత్రలో ఒక్కసారి కూడా భారత్‌పై గెలవని ఐదు రోజుల క్రితం అనూహ్యంగా టీ20 విజయాన్ని అందుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా గత ఆదివారం (నవంబరు 3) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం కోసం మహేంద్రసింగ్ ధోనీ వ్యూహాన్ని అనుసరించినట్లు తాజాగా భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.

Read More:

ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలోనే 154/3తో ఛేదించేసింది. పిచ్‌పై బంతి ఆగి నెమ్మదిగా బ్యాట్‌‌పైకి రావడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు. ముఖ్యంగా.. పార్ట్‌టైమ్ బౌలర్లని తెలివిగా వినియోగించుకున్న అతను భారత హిట్టర్లని కట్టడి చేయడంలో సఫలమయ్యాడు.

Read More:

భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఐదుగురు ప్రొఫెషనల్ బౌలర్లని మాత్రమే వినియోగించుకున్నాడు. ఆఖరి ఓవర్‌‌ని ఆల్‌రౌండర్‌ శివమ్ దూబేతో వేయించినా.. అప్పటికే మ్యాచ్‌ భారత్‌కి చేజారిపోయింది. గత గురువారం జరిగిన రెండో టీ20లో గెలిచిన భారత్ మూడు టీ20ల సిరీస్‌ని 1-1తో సమం చేయగా.. ఆఖరి టీ20 ఆదివారం రాత్రి నాగ్‌పూర్‌లో జరగనుంది.

Read More:

భారత్ చేతిలో వరుసగా 8 టీ20ల్లో ఓడిన రికార్డ్ ఉన్న బంగ్లాదేశ్ తొలి టీ20లో చారిత్రక విజయం అందుకోవడంపై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ‘అగ్రశ్రేణి జట్లపై విజయం సాధిస్తే..? ఆటోమేటిక్‌గా జట్టు ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపవుతుంది. తొలి టీ20లో మహ్మదుల్లా చాలా తెలివిగా మ్యాచ్ గమనానికి అనుగుణంగా బౌలింగ్ మార్పులు చేసి ఫలితం రాబట్టాడు. ఆ మ్యాచ్‌లో అతని కెప్టెన్సీ చూస్తే నాకు మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ గుర్తుకొచ్చింది. పవర్‌ప్లే తర్వాత ధోనీ అలాంటి పిచ్‌లపై వ్యూహాత్మకంగా పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించేవాడు. తొలి టీ20లో సరిగ్గా అలానే మహ్మదుల్లా కూడా పార్ట్ టైమర్స్‌ని వినియోగించుకున్నాడు’ అని వెల్లడించాడు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.