ధోనీ ఆ క్వాలిటీతోనే చెన్నై ‘సూపర్’ సక్సెస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మూడు టైటిళ్లు గెలవడంతోపాటు పాల్గొన్న ప్రతీసారి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఏకైక టీమ్ సీఎస్కేనే. అయితే స్థిరమైన ప్రదర్శనకు చిరునామాగా చెన్నై మారడం వెనుక కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానిస్తున్నాడు.

Read Also:

నాయకత్వ లక్షణాలతోనే చెన్నై విజయ యాత్ర సాగిస్తుందని మంజ్రేకర్ అభిప్రాయపడుతున్నాడు. గతేడాది మాదిరే ధోనీ ఈసారి బ్యాట్ ఝులిపిస్తే చెన్నై మరోసారి సత్తాచాటుతుందని అన్నాడు. మరోవైపు ఈసారి జరిగే వేలంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని,, అప్పుడు జట్టు మరింత బలోపేతమవుతుందని వ్యాఖ్యానించాడు. చెన్నై టీమ్‌లో స్టార్లకు కొదువలేదు. ధోనీతోపాటు డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, ఫాఫ్ డుప్లెసిస్‌లాంటి ఆటగాళ్లతో కళకళలాడుతోంది. అయితే మిడిలార్డర్‌లో కాస్త బలహీనంగా ఉంది. అంబటి తిరుపతి రాయుడు, కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లు గతేడాది విఫలమయ్యారు. దీంతో ఈ ఏడాది ఫైనల్లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి రన్నరప్‌కు పరిమితమైంది.

Read Also:

ఇక ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. జట్టును మూడుసార్లు విజేతగా నిలిపాడు. 2009, 10, 18లలో చాంపియన్‌గా తీర్చిదిద్దాడు. చరిత్రలో అత్యధికంగా ఎనిమిదిసార్లు ఫైనల్ ఆడిన ఏకైక టీమ్ సీఎస్కేనే కావడం విశేషం. ఇందులో మూడుసార్లు చాంపియన్‌గా నిలవగా.. ఐదుసార్లు రన్నరప్ హోదా సాధించింది.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.