తల్లా.. రాక్షసా? చిన్నారి మీద కూర్చొని చిత్రహింసలు, బాధతో ఏడుస్తున్నా…

భం శుభం తెలియని చిన్నారులను కంటిపాపలా చూసుకోవల్సిన ఆ తల్లి చేసిన అరాచకం ఇది. సుమారు రెండు లేదా మూడేళ్ల వయస్సు ఉన్న బాలికను మంచం మీద పడుకోబెట్టిన ఆ మహిళ.. ఆమెపై కూర్చుంది. ఆ చిన్నారి నొప్పి పుట్టేలా పైకి కిందికి ఊగింది. ఆ చిన్నారి ఎముకలను విరిచేలా ఆమెను వెనక్కి మడిచి మరోసారి ఆమెపై కూర్చొంది. ఇదంతా మరో వ్యక్తి వీడియో తీశాడు.

Also Read:

ఈ వీడియో చూసిన నెటిజనులు టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వీడియోను తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసి.. ఆమె ఆచూకీ లభించినవాళ్లు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తాము కూడా ఆ వీడియోలో ఉన్న మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆమె శరీరంపై ఉన్న టాటూను కూడా పోస్ట్ చేశారు.

Also Read:

ఈ వీడియోలో ఆ చిన్నారి ఏడుపు విన్నవారికి గుండె బరువెక్కుతుంది. బాధతో ‘అమ్మా, వదిలిపెట్టు’ అంటూ వేడుకున్నా.. ఆ మహిళ ఆ చిన్నారిని వేధిస్తూనే ఉంది. అంతటి బరువు చిన్నారిపై పడితే ఊపిరి ఆగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను వెతికే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారో తెలియరాలేదు. ఇదివరకు కూడా కొంతమంది పిల్లలను హింసిస్తూ వీడియోలను పోస్టు చేసి పోలీసులకు చిక్కారు. ఆ చిన్నారిని హింసిస్తున్న ఆ రాక్షసి ఆచూకీ కూడా తెలియాలని కోరుకుందాం.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.