టీ20 సూపర్ ఓవర్.. కివీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు

న్యూజిలాండ్‌ని సూపర్ ఓవర్ గండం మళ్లీ వెంటాడింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ కారణంగా కొద్దిలో కప్‌ని చేజార్చుకున్న కివీస్.. ఆదివారం మరోసారి చేతిలోనే సూపర్ ఓవర్‌లో ఓడిపోయి టీ20 సిరీస్‌ని చేజార్చుకుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో రెండు జట్లు సరిగ్గా 146 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అవగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్‌లో మాత్రం ఇంగ్లాండ్ ఎక్కువ పరుగులు చేసి గెలుపొందింది. దీంతో.. ఐదు టీ20ల సిరీస్ కూడా 3-2తో ఇంగ్లాండ్ వశమైంది.

Read More:

ఆక్లాండ్ వేదికగా ఈరోజు జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌ని వర్షం కారణంగా 11 ఓవర్లకి కుదించారు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (50: 20 బంతుల్లో 3×4, 5×6), కొలిన్ మున్రో (46: 21 బంతుల్లో 2×4, 4×6), టిమ్ సైపర్ట్ (39: 16 బంతుల్లో 1×4, 5×6) సిక్సర్ల వర్షం కురిపించడంతో 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో జానీ బెయిర్‌స్టో (47: 18 బంతుల్లో 2×4, 5×6), శామ్ కరన్ (24: 11 బంతుల్లో 2×4, 2×6) చెలరేగడంతో ఇంగ్లాండ్ కూడా సరిగ్గా 11 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగలిగింది. దీంతో.. స్కోర్లు సమమవగా.. సూపర్ ఓవర్ అనివార్యమైంది.

Read More:

సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. 17 పరుగులు చేసింది. టిమ్ సౌథీ వేసిన ఆ ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, జానీ బెయిర్ స్టో చెరొక సిక్స్ కొట్టారు. అనంతరం ఛేదనలో క్రిస్ జోర్దాన్ బౌలింగ్ చేయగా.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ సైపర్ట్ ఒక ఫోర్ కొట్టి ఔటవగా.. గ్రాండ్‌హోమ్ తేలిపోయాడు. దీంతో.. ఆ జట్టు 8 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read More:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.