టీ20లో రోహిత్ శర్మ బద్దకం.. గాల్లోకి ఎగిరిన వికెట్

బంగ్లాదేశ్‌తో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. శిఖర్ ధావన్‌ (19: 16 బంతుల్లో 4×4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో) రెండో ఓవర్‌లో ఔటైపోయాడు.

ఫాస్ట్ బౌలర్ సైపుల్ ఇస్లామ్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని ఎటువంటి పాదాల కదలికలు లేకుండా ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. బంతిని బ్యాట్‌కి మిడిల్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తాకిన బంతి వెనక్కి వచ్చి లెగ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. మ్యాచ్ కామెంటేటర్ మురళీ కార్తీక్ మాటల్లో చెప్పాలంటే రోహిత్ శర్మ తన బద్దకంతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి టీ20లోనూ ఇలానే సైపుల్ బౌలింగ్‌లో పాదాల్ని కదల్చకుండా ఆడిన రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికిపోయాడు.

Read More:

రోహిత్ శర్మ పెవిలియన్‌కి వెళ్తుండగా.. అతనికి ఎదురుగా మైదానంలోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. దీంతో.. అతడ్ని కొన్ని క్షణాల పాటు ఆపిన రోహిత్ శర్మ.. ఏదో సూచన చేసినట్లు కనిపించింది. ఆ ఓవర్‌లో రాహుల్‌కి కూడా సైపుల్ అదే తరహా బంతులు సంధించాడు. కానీ.. రాహుల్ మాత్రం కొద్దిపాటి పాదాల కదలికలతో వాటిని బ్యాట్‌తో అడ్డుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ 4వ ఓవర్‌లోనూ రాహుల్‌కి మరోసారి రోహిత్ శర్మకి విసిరిన బంతుల్ని సైపుల్ సంధించగా.. ఆఫ్ స్టంప్‌ లైన్‌పైకి వచ్చిన రాహుల్ వరుసగా 4, 4 బాదేశాడు. బహుశా.. రాహుల్‌కి రోహిత్ చెప్పిన సూచన అదేనేమో..!

Read More:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.