టీమిండియాని హెచ్చరించిన కోహ్లీ కోచ్ శర్మ

భారత్ పర్యటనకి ఈ నెల మూడో వారంలో ఆస్ట్రేలియా రాబోతోంది. కంగారూలతో ఈనెల 24 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడబోతుండగా.. ఆస్ట్రేలియాతో జాగ్రత్తగా ఉండాలని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ హెచ్చరించాడు. గత ఏడాది ఇలానే ఫిబ్రవరిలో భారత్ పర్యటనకి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. రెండు టీ20ల సిరీస్‌ని 2-0తో, ఐదు వన్డేల సిరీస్‌ని 3-2తో చేజిక్కించుకుంది. ముఖ్యంగా.. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టు గెలవగా.. అనూహ్యంగా పుంజుకున్న కంగారూలు చివరి మూడు వన్డేల్లోనూ కోహ్లీసేనకి షాకిచ్చారు.

‘ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ రూపంలో భారత్ జట్టుకి గట్టి సవాల్ ఎదురుకాబోతోంది. మునుపటితో పోలిస్తే ఈసారి కంగారూలు మరింత సంసిద్ధతతో పర్యటనకి వస్తున్నారు. కాబట్టి.. ఆస్ట్రేలియా టీమ్‌ని తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని రాజ్‌కుమార్ శర్మ హెచ్చరించాడు.

జనవరి 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుండగా.. తొలి వన్డే మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఆ తర్వాత 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, ఆఖరిగా 19న బెంగళూరులో చివరి వన్డేతో ఈ సిరీస్‌ ముగుస్తుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం ఇప్పటికే భారత్ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు.

భారత వన్డే జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.