టాటా మోటార్స్ బంపరాఫర్.. గిఫ్ట్‌గా రూ.5 లక్షల బంగారం.. ఫ్రీగానే వాషింగ్ మెషీన్, టీవీ, ఫోన్!

వాహన కొనుగోలుదారులకు శుభవార్త. వీరికి దీపావళి మళ్లీ వచ్చింది. దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తన కస్టమర్ల కోసం మెగా ఆఫర్‌ ప్రకటించింది. వాహన కొనుగోలుపై ఏకంగా రూ.5 లక్షల బంగారం గెలుచుకునే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వాషింగ్ మెషీన్, ఎల్ఈడీ టీవీ, మిక్సర్, స్మార్ట్‌ఫోన్ వంటి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.

టాటా మోటార్స్‌ ఎస్‌యూవీ లేదా పికప్‌ ట్రక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ అద్భుతమైన బహుమతులను ఇంటికి పట్టుకెళ్లొచ్చు. దీంతో కస్టమర్ల జీవితాల్లో మరోసారి దీపావళి వెలుగులు నింపుతామని టాటా మోటార్స్‌ తెలిపింది. కంపెనీ ట్విట్టర్ వేదికగా ఈ ఆఫర్లను ప్రకటించింది.

Also Read:

Also Read:

టాటా మోటర్స్‌ తన ఎస్‌యూవీ కారును లేదా పికప్‌ ట్రక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు టీవీ, వాషింగ్‌ మెషీన్‌, మిక్సీ వంటి గిఫ్ట్‌లను అందిచనుంది. అంతేకాకుండా వీటితోపాటు ఏకంగా రూ.5 లక్షల విలువైన బంగారాన్ని కూడా ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌ నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

Also Read:

ఇకపోతే దేశీ మార్కెట్‌లో వాహన కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాహన అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో కంపెనీలు వరుసబెట్టి కస్టమర్లకు ఆఫర్లు అందిస్తున్నాయి. దీపావళి పండుగ సీజన్‌లోనూ వాహన కంపెనీలు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందించాయి. ఇప్పుడు టాటా మోటార్స్ మళ్లీ ఆఫర్లు తీసుకువచ్చింది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.