జిమ్‌ వీడియోతో సెగలు రేపుతున్న కాజల్‌.. అస్సలు తగ్గట్లేదు!

సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా కాజల్ అగర్వాల్ ఇప్పటికీ హాట్‌ బ్యూటీగానే అందరినీ అలరిస్తోంది. కెరీర్‌ పరంగా ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ తన అందం అభినయంతో ప్రతీ సారి తిరిగి నిలదొక్కుకుంది. ఒక దశలో ఇక కాజల్‌ కెరీర్‌ ముగిసనట్టే అనుకుంటున్న సమయంలో సీనియర్‌ హీరోల సరసన ఆడిపాడేందుకు అంగీకరించి అందరికీ షాక్‌ ఇచ్చింది.

ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్న ఈ భామ అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోంది. యంగ్‌ జనరేషన్‌ భామలకు పోటి ఇచ్చేందుకు చెమటోడుస్తోంది. తాజాగా ఈ భామ తన హాట్ వర్క్‌ అవుట్స్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వారం రోజుల పాటు ఇబ్బంది పెట్టిన జ్వరం నుంచి రికవర్‌ అయ్యేందుకు శరీరంలోని జెమ్స్‌ను వెళ్లగొట్టేందుకు బెస్ట్ వే అంటూ మూడు వర్క్‌ అవుట్ వీడియోస్‌ను పోస్ట్ చేసింది.

Also Read:

ప్రస్తుతం ఈ భామ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్‌ హిట్ క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న క్రాస్‌ఓవర్‌ మూవీ కాల్ సెంటర్‌తో పాటు హిందీ సినిమా ముంబై సాగా, తమిళ సినిమా ఇండియన్‌ 2లో నటిస్తోంది.

Also Read:

గత కొంతకాలంగా కాజల్‌కు కాలం కలిసి రావటం లేదు. 2017లో రిలీజ్‌ అయిన మెర్సల్‌ తరువాత ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. కాజల్‌ హీరోయిన్‌గా నటించిన అ!, ఎమ్మెల్యే, కవచం, సీత, రణరంగం సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాజల్‌.

Also Read:


Leave comment

Your email address will not be published. Required fields are marked with *.