చెల్లిని వేధిస్తున్నాడని బావ గొంతు కోసేశాడు..

చెల్లిని నిత్యం వేధిస్తున్నాడనే ఆగ్రహంతో బ్లేడుతో బావ గొంతు కోసేశాడో వ్యక్తి. తెలంగాణలోని జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వల్లభాపురం ఆవాసం జగన్‌నాయక్‌ తండాకు చెందిన రమావత్‌ దేవేందర్‌తో సూర్యాపేట భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన శ్వేతకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప ఉంది. అయితే గత రెండు నెలలుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

Also Read:

ఈ విషయపైనే దేవేందర్ ఓసారి జైలుకు కూడా వెళ్లి ఇటీవల విడుదలై వచ్చాడు. అనంతరం భార్యకు నచ్చజెప్పి తిరిగి కాపురానికి తీసుకొచ్చాడు. అయితే రెండ్రోజుల క్రితం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరగ్గా శ్వేత పోలీసులకు సమాచారం ఇచ్చి పుట్టింటికి వెళ్లింది. పోలీసులు జగన్‌నాయక్‌ తండాకు వెళ్లి దేవేందర్‌ను విచారించారు. భర్తపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం శ్వేత తన కుటుంబ సభ్యులతో కలిసి చివ్వెంల పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అయితే సిబ్బంది లేకపోవడంతో కుటుంబంతో పాటు అక్కడే వేచి ఉన్నారు.

Also Read:

ఈ విషయం తెలుసుకున్న దేవేందర్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి భార్యతో ఇక నుంచి బుద్ధిగా ఉంటానని బతిమిలాడసాగాడు. అయితే శ్వేతతో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె అన్న రఘురాం బావను చూసి కోపంతో రగిలిపోయాడు. పక్కన గోడపై ఉన్న ఓ బ్లేడు తీసుకుని బావ గొంతు కోశారు. దీంతో అక్కడున్న వారి అరుపులు, కేకలు వినిపించడంతో పోలీస్ స్టేషన్‌లోని మహిళా సిబ్బంది, రైటర్‌ బయటకు వచ్చారు. వెంటనే దేవేందర్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం దేవేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బాధితులు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో సిబ్బంది ఎవరూ లేని విషయం వాస్తవమేనని, ఈ విషయమై విచారించి కేసు నమోదు చేస్తామని ఎస్సై ఎన్‌.లవకుమార్‌ తెలిపారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.