చిన్నారి వర్షితపై అమానుషం.. ఆ కామాంధుడు వీడే!

ఏపీలో సంచలనం రేపిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అమానుషానికి పాల్పడిన నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్, పెళ్లిలో అతన్ని చూసిన వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ ఊహా చిత్రాన్ని రూపొందించారు. ఇలాంటి పోలికలతో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.. అలాగే నిందితుడ్ని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

చిన్నారిపై దారుణానికి ఒడిగట్టి నిందితుడు కర్ణాటకకు చెందినవాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే మరో అనుమానితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారట. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించడంతో పోలీసులు కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని చెబుతున్నారు.

బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత తల్లిదండ్రులతో కలిసి మూడు రోజుల క్రితం చేనేతనగర్‌లోని కల్యాణ మండపంలో పెళ్లికి వెళ్లింది. న పెళ్లికి వర్షిత తల్లిదండ్రులతో కలిసి హాజరైంది. కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతూ చుట్టుపక్కల గాలించారు. ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అంతా షాకయ్యారు. పోస్టుమార్టం నివేదికలో వర్షితపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలియడంతో అంతా షాకయ్యారు.

ఇటు వర్షిత ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. వర్షిత హత్యాచారం తనను తీవ్ర కలిచివేసిందన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. నేరస్థుడిని వీలైనంత తర్వగా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.