గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. 3 నెలల కనిష్టానికి పతనం!

దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర మూడు నెలల కనిష్ట స్థాయికి పతనమైంది. స్పాట్ గోల్డ్ బంగారం ధర శుక్రవారం ఔన్స్‌కు 1455.8 డాలర్లకు పడిపోయింది. ఆగస్ట్ నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.2 శాతం తగ్గుదలతో ఔన్స్‌కు 1462.9 డాలర్లకు క్షీణించింది.

అమెరికా, చైనా మధ్య వాణిజ్య డీల్ కుదరొచ్చనే అంచనాలు బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపాయి బంగారం ధర బాటలోనే కూడా నడిచింది. వెండి ధర 1.2 శాతం క్షీణతతో ఔన్స్‌కు 16.9 డాలర్లకు పడిపోయింది. అమెరికా-చైనా డీల్ ఓకే కావొచ్చనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరపై ఒత్తిడి నెలకొందని యస్ సెక్యూరిటీస్ పేర్కొంది.

Also Read:

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అప్పుడు అమెరికా చైనా దిగుమతులపై టారిఫ్‌లను ఎత్తివేసే ఛాన్స్ ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా డీల్ కుదరలేదని మీడియాతో పేర్కొన్నాడు. ఇది బంగారం ధరకు సానుకూలమైన అంశం.

Also Read:

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది బంగారం ధర 14 శాతానికి పైగా పరుగులు పెట్టడానికి అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలే ప్రధాన కారణం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారం డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ధరలు పైకి కదులుతాయి.

Also Read:

అమెరికా ఫెడరల్ రిజర్వు తాజాగా వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఇది కూడా బంగారం ధరకు ఊరటనిచ్చే అంశమే. అయితే తదుపరి రేట్ల కోత ఉండదని, ఆర్థిక వ్యవస్థ డౌన్‌టర్న్ తీసుకుంటేనే రేట్ల కోత అంశం గురించి ఆలోచిస్తామని ఫెడరల్ రిజర్వు పేర్కొంది. ఇది బంగారం ధరపై ఒత్తిడి పెంచే నిర్ణయం.

Also Read:

ఇకపోతే భారత్ విషయానికి వస్తే.. దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం 0.28 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,682కు చేరింది. అయితే బంగారం ధర సెప్టెంబర్ నెల ఆరంభంలో రూ.40,000 మార్క్‌కు చేరింది. అప్పటి నుంచి చూస్తే.. ఇప్పుడు బంగారం ధర రూ.2,000 దిగువునే ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.43,950 స్థాయిలో కదలాడుతోంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.