గుంటూరు, మంగళగిరి పలకలేని మాలోకం.. విజయసాయి ఘాటు వ్యాఖ్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగుతోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వానిది అనాలోచిత చర్య అని విపక్షాలు విమర్శిస్తుంటే.. పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు దూరం చేస్తారా? అని వైఎస్సార్సీపీ ఎదురుదాడికి దిగుతోంది.

తాజాగా ఇదే విషయమై ట్విటర్‌లో స్పందించారు వైఎస్సార్సీపీ ఎంపీ . టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. కనీసం సచివాలయం, గుంటూరు, మంగళగిరి అని పేర్లు పలకడమే రాని మాలోకం కూడా తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడంటూ ఘాటు విమర్శలు చేశారు.

Read Also:

మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆ చదువులెందుకు అంటున్నాడని విజయసాయి విమర్శించారు. పేద వర్గాలు గ్రామాలు దాటి బయటకు రాకూడదనేదే తెలుగుదేశం నేతల దుర్మార్గపు కోరిక అని విజయసాయి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువుతారని, పేదలకు మాత్రం ఆ చదువులు అందకూడదన్నదే వారి ఉద్దేశంగా కనపడుతోందని ఆరోపించారు.

ఇంగ్లిష్ మీడియంలో చదివితే తెలుగుదేశానికి మరో సమస్య ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతా ఇంగ్లిష్ నేర్చుకుంటే ఇక తెలుగు పేపర్లు ఎవరుూ చదవరని పచ్చమీడియా ఆందోళన చెందుతున్నట్లుందని విమర్శలు చేశారు. బాబు అవినీతిని కప్పిపుచ్చి పాఠకుల మెదళ్లలోకి స్లో పాయిజన్ ఎక్కించే అవకాశం ఉండదని ఈ ఏడుపంటూ ఎద్దేవా చేశారు. వాళ్ల కుటుంబాల్లోని పిల్లలు తెలుగు మాట్లాడటానికే ఇష్టపడరని విజయసాయి పేర్కొన్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.