ఖండాలు దాటి ప్రాణాలు తీసిన టిక్‌టాక్‌.. కువైట్‌లో రాజోలు యువకుడు..

సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ మరొకరి చావుకు కారణమైంది. డబ్బులు తీసుకుని పరారయ్యాడంటూ ఫొటోలను వైరల్ చేయడంతో ఓ తెలుగు యువకుడు కువైట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిచేస్తున్న కంపెనీలో దినార్లు తీసుకుని పరారయ్యాడంటూ ఫ్రెండ్స్ వైరల్ చేసిన వీడియోతో మనస్థాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఈ విషాద సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read:

రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహన్ కుమార్ ఉపాధి నిమిత్తం కువైట్‌‌కు వెళ్లాడు. అక్కడే పని చేసుకుంటూ గ్రామంలో ఉంటున్న తల్లికి డబ్బులు పంపేవాడు. మోహన్ కువైట్‌లో చిట్టీలు వేసి అక్కడి కరెన్సీ రెండు వేల దినార్లు తీసుకుని పరారయ్యాడంటూ అతని స్నేహితులు వడ్డీ దుర్గారావు, మధు తదితరులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మోహన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కువైట్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read Also:

ఈ నెల 3 వ తేదీనే ఘటన జరగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోహన్ కువైట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బంధువులు ఇండియన్ ఎంబసీ, కువైట్ ఎంబసీని సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామం శివకోటికి తీసుకకువచ్చారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు శవంగా తిరిగిరావడం చూసి ఆ తల్లి గుండె బద్దలైంది. కొడుకు డెడ్‌బాడీని చూసి మోహన్ తల్లి బోరున విలపించడం పలువురిని కలచివేసింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.