కొన్ని గంటల్లో పెళ్లి.. ఫంక్షన్‌ హాల్లోనే పెళ్లికొడుకు ఆత్మహత్య

మరికొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఫంక్షన్ హాల్లో బంధువులు ఆర్తనాదాలు వెల్లువెత్తాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న పెళ్లివారంతా విషాదంలో ముగినిపోయారు. పెళ్లి పీటలెక్కి నూతన జీవితానికి నాందిపలకాల్సిన పెళ్లికొడుకు చేసుకోవడమే ఈ విషాదానికి కారణం.

Also Read:

హైదరాబాద్‌కు చెందిన సందీప్(24) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇటీవల అతడికి ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఆదివారం కొంపల్లిలోని శ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా పెళ్లి చేసేందుకు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రే పెళ్లివారంతా అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉన్న సమయంలో సందీప్ తన గదిలో ఉరేసుకున్నాడు.

Also Read:

ఈరోజు ఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్న సందీప్‌ను చూసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. వెంటనే అతడికి కిందికి దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్పటివరకు సందడిగా ఉన్న వివాహ వేదిక కాస్త విషాదంగా మారిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సందీప్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారంతోనే ఇలా చేశాడా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.