కొడుకుని పట్టుకుని గుక్కపెట్టి ఏడ్చిన రోజా.. పండుగ పూట భావోద్వేగం

అమ్మ ప్రేమ అంతే.. బిడ్డకు ప్రేమను పంచడంలో కాస్త వెలితి ఉన్నా ఆ గుండె తట్టుకోలేదు. సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే అటు టీవీ షోలతోనూ.. ఇటు రాజకీయాల్లోనూ బిజీగా మారడంతో తన బిడ్డలకు సమయం కేటాయించలేకపోతున్నానంటూ కన్నీరుమున్నీరైంది. తన బిడ్డను పట్టుకుని గట్టిగా ఏడ్చేశారు.

సంక్రాంతి కానుగా.. ఈటీవీ మల్లెమాల వారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈటీవీ జబర్దస్త్, ఢీ ఇతర కార్యక్రమాల్లోని కంటెస్టెంట్స్‌లు, వాళ్ల పిల్లలతో ‘అమ్మ నాన్న ఓ సంక్రాంతి’ అనే స్పెషల్ కార్యక్రమాన్ని రూపొందించారు. జనవరి 15న ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా ప్రోమోను విడుదల చేశారు.

ఇందులో తమ తల్లిదండ్రులను ఉద్దేశించి ‘కనిపెంచిన’ అనే ఎమోషనల్ సాంగ్‌ను పిల్లలు పాడి వినిపించారు. ఈ సాంగ్ అనంతరం రోజా తన కొడుకుతో మమ్మీ అంటే భయం లేదా? అని అడగ్గా.. ‘నాకు నువ్వంటే ప్రేమ మమ్మీ భయం లేదు’ అని అనడంతో భావోద్వేగానికి గురయ్యారు రోజా.

‘నేను ఒకవైపు షూటింగ్స్, మరోవైపు పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నప్పుడు నా పిల్లలు చాలా అండర్ స్టాండింగ్‌తో ఉంటారు. నేను కష్టపడేవి వీళ్ల కోసమే. కాని వీళ్లు మాకు కావాల్సింది డబ్బు కాదు మమ్మీ మీరు. మీరు మాతో ఉండటం అంటారు’ అని కొడుకుని పట్టుకుని భావోద్వేగానికి లోనై వెక్కి వెక్కి ఏడ్చేసింది రోజా. తాను ఏడ్వడమే కాకుండా స్టేజ్ మీద ఉన్న మిగతా వారిని, ఆడియన్స్‌ని కూడా ఏడిపించేశారు రోజా. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.