కివీస్‌పై జోరూట్ డబుల్ సెంచరీ.. రికార్డ్స్ బ్రేక్

న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌‌లో 375 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. 9.5 ఓవర్లు ముగిసే సమయానికే 24/2తో ఒత్తిడిలో పడింది. కానీ ఈ దశలో క్రీజులోకి వచ్చిన జోరూట్ (226: 441 బంతుల్లో 22×4, 1×6) బాధ్యతాయుత డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్ టీమ్‌ని ఆదుకున్నాడు. దీంతో.. ఇంగ్లాండ్ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులకి ఆలౌటవగా.. 101 పరుగుల ఆధిక్యం లభించింది.

Read More:

హామిల్టన్ టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా జోరూట్ అరుదైన రికార్డ్స్ నెలకొల్పాడు. విదేశీ గడ్డపై ఇప్పటి వరకూ ముగ్గురు ఇంగ్లాండ్ కెప్టెన్లు మాత్రమే టెస్టుల్లో డబుల్ సెంచరీలు నమోదు చేయగా.. తాజాగా జోరూట్ కూడా వారి సరసన చేరాడు. 1954లో కింగ్‌స్టన్‌లో మాజీ కెప్టెన్ లెన్ హట్టన్ 205 పరుగులు చేయగా.. ఆ తర్వాత 1962లో కరాచీ వేదికగా టెడ్ డెక్స్‌టర్ ఈ ఘనత సాధించాడు. ఇక 2015లో అబుదాబి వేదికగా పాకిస్థాన్‌పై అలిస్టర్ కుక్ 263 పరుగులతో చివరిగా ఇంగ్లాండ్ తరఫున విదేశాల్లో ద్విశతకం నమోదు చేసిన కెప్టెన్‌గా ఈరోజు వరకూ ఉన్నాడు.

Read More:


ఇంగ్లాండ్ ఆలౌట్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ టీమ్ సోమవారం ఆట ముగిసే సమయానికి 96/2తో నిలవగా.. ఇంకా 5 పరుగులు ఆ జట్టు వెనకబడే ఉంది. కానీ.. ఆటలో ఒక రోజు మాత్రమే ఇక మిగిలి ఉండటంతో మ్యాచ్ ఫలితం తేలే సూచనలు కనిపించడం లేదు. తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసింది.

Read More:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.