కాలేజ్ స్టూడెంట్స్‌కు 5 మనీ టిప్స్.. ఫాలో అయితే బిందాస్!

ఉద్యోగం చేసే వారికి డబ్బు కొరత ఉండకపోవచ్చు. వాళ్లు మనీని మేనేజ్ చేయగలరు. అయితే కాలేజ్‌కు వెళ్లే స్టూడెంట్స్‌కు ఆదాయం ఉండకపోవచ్చు. అదేసమయంలో చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. దీంతో తల్లిదండ్రులను లేదా స్నేహితులకు అడిగి డబ్బు తీసుకుంటూ ఉంటాయి.

తల్లిదండ్రులపై ఎక్కువగా ఆధారపడటం కొన్ని సందర్భాల్లో బాగుండకపోవచ్చు. అందుకే మంత్లీ బడ్జెట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఖర్చులన్నీ ఈ బడ్జెట్‌ను దాటకుండా చూసుకోవాలి. అప్పుడు ఇంట్లో వారికి ఎక్కువగా డబ్బు అడగాల్సిన అవసరం రాదు.

Also Read:

కాలేజీ విద్యార్థులకు ఐదు పర్సనల్ ఫైనాన్స్ టిప్స్..

1. ఎక్కువగా ఖర్చు చేయకూడదు. స్నేహితులను కలవడం, జిమ్‌కు వెళ్లడం, పార్టీలకు వెళ్లడం వంటి వాటికి కొంత దూరంగా ఉండటం మంచిది.

2.స్నేహితులను మాటిమాటికి డబ్బులు అడగవద్దు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం చెడిపోయే ప్రమాదం ఉండొచ్చు. అందువల్ల మంత్లీ ఖర్చులను నియంత్రించుకోండి.

Also Read:

3. కొంత మందికి పుస్తకాలు, సపోర్టివ్ జర్నల్స్‌ను సేకరించడం ఆసక్తిగా ఉండొచ్చు. సాధారణ మెటీరియల్‌తో పోలిస్తే వీటి ధర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీకు అవసరమైన పుస్తకాలను మాత్రమే కొనుగోలు చేయండి. అలాగే డిజిటల్ మెటీరియల్ షేరింగ్, బుక్స్ సాఫ్ట్ కాపీలు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అలవాటు చేసుకోండి.

Also Read:

4. పలు ఎంటర్‌ప్రైజెస్ స్టూడెంట్స్ కోసం డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తూ ఉంటాయి. డైనింగ్ ఔట్, స్టడీ మెటీరియల్స్, ట్రావెలింగ్, గ్యాడ్జెట్స్ కొనుగోలు వంటి సమయంలో ప్రమోషనల్ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. దీంతో ఖర్చులు కొంత తగ్గొచ్చు.

Also Read:

5. చీప్ అండ్ బెస్ట్ కోసం వెతకండి. మంత్లీ బడ్జెట్‌కు మించి ఎప్పుడూ ఎక్కువ ఖర్చు చేయవద్దు. ఆరంభంలో ఇది కొంత కష్టంగానే అనిపించొచ్చు. అయితే అలవాటు చేసుకుంటే మీకు జీవితంలో ఉపయోగపడుతుంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.