ఐపీఎల్‌లో ఇక నుంచి టీవీ అంపైర్.. విశేషాలు

రాబోయే సీజన్‌లో సరికొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నోబాల్స్‌ను గుర్తించడంలో అంపైర్లు విఫలం కావడంతో గతేడాది తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ ఏడాది దిద్దబాటు చర్యలకు దిగుతోంది. ఈక్రమంలో ఫ్రంట్ ఫూట్‌ను పరిశీలించేందుకు అంపైర్‌ను నియమించాలని నిర్ణయానికొచ్చింది. ఈక్రమంలో మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లకుతోడు మరో అంపైర్ కేవలం బౌలర్ ఫ్రంట్ ఫూట్‌ను పరిశీలిస్తాడని బీసీసీఐ చీఫ్ తెలిపాడు.

‘నోబాల్‌ను ప్రత్యేకంగా పరిశీలించడం కోసమే అంపైర్లు ఉంచాలనేదానిపై అధ్యయనాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో రాబోయే సీజన్‌లో దీన్ని అమల్లో పడతాం. టీ20 అనేది చాలా వేగవంతమైన గేమ్. అందుకే నోబాల్స్‌ను పరిశీలించేందుకు టీవీ అంపైర్‌ను నియమిస్తాం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇటీవల జరిగిన పింక్ మ్యాచ్‌లోనూ ఈ విధానాన్ని పరిశీలించామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Read Also:

ఐపీఎల్‌లో ఈ విధానం విజయవంతమైతే రెగ్యులర్‌గా అమలు చేస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీనియర్ మెంబర్ చెప్పారు. ఈ కాన్సెప్ట్ వినడానికి కాస్త చిత్రంగా అన్పించినప్పటికీ, గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చ జరిపి ఆమోదం తెలిపామని వెల్లడించాడు. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా-పాకిస్థాన్ రెండో టెస్టు సందర్భంగా కూడా నోబల్స్‌ను అంపైర్లు గుర్తించలేకపోయారు. ఒక్కరోజులో ఏకంగా 21 సార్లు అంపైర్లు నోబాల్స్‌ను గుర్తించకపోవడంతో ఆసీస్ తీవ్రంగా నష్టపోయింది. ఈక్రమంలో నోబాల్ చూడటానికి అంపైర్లు ఉండాలనే వాదనలకు బలం చేకూర్చింది.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.