ఐదేళ్లలో 27 మంది యువకులకు వల.. పోలీసులకు చిక్కిన మహిళా న్యాయవాది

పెళ్లి కాని యువకులను మాయమాటలతో ముగ్గులోకి దించి వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరిస్తున్న కిలేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మొదట మాయ మాటలతో యువకులను ముగ్గులోకి దించుతుంది. ఆ తర్వాత బాగా సన్నిహితమవుతుంది. కొన్నాళ్లకు.. నాపై అత్యాచారానికి యత్నించావు.. బెదిరింపులకు పాల్పడ్డావంటూ వారిపై అక్రమంగా కేసులు పెడుతూ.. బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది’ అని పోలీసులు ఈ మాయలేడి గురించి మీడియాకు వివరించారు.

Also Read:

మలక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన షాదాన్‌ సుల్తానా(27) న్యాయవాదిగా పని చేస్తోంది. ఆమెకు అబిడ్స్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ రికార్డు అసిస్టెంట్‌ రహీంతో 2015లో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మెలిగింది. రహీంతో ఫోన్లో తరుచూ మాట్లాడుతూ అతడిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పుడప్పుడు అతడితో శారీరకంగా కలిసి వీడియో తీసింది. కొద్దిరోజుల తర్వాత ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని రహీంను బెదిరించింది. దీంతో అతడు రూ.3లక్షలు ఆమె బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడు. మరో రూ.5లక్షలు ఇవ్వాలని మళ్లీ వేధించడంతో మనస్తాపానికి గురై అక్టోబర్ 19న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

Also Read:

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి రహీం స్టేట్‌మెంట్‌ రికార్డు చేయగా షాదాన్‌ సుల్తానా ఆగడాల చిట్టా వెలుగులోకి వచ్చింది. సుల్తానా 2014 నుంచే ప్రేమ నాటకాలు మొదలు పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ ఏడాది ఇద్దరు యువకులను ప్రేమ పేరుతో లొంగదీసుకుని బెదిరించింది. 2018లో 14 మందిని, 2019లో ముగ్గురిని వలలో వేసుకుని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో సుల్తానాపై సైఫాబాద్‌ పీఎస్‌లో 3, చాదర్‌ఘాట్‌లో 5, ఎల్బీనగర్‌లో 3, అంబర్‌పేట్‌ 2, అబిడ్స్‌లో 2, మీర్‌ చౌక్‌లో 4, నారాయణగూడ, మలక్‌పేట్, నల్లకుంట, ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మొత్తం 27 కేసులు ఆమెపై ఉన్నాయి. ఈమె బాధితుల్లో ఓ యంగ్ లాయర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.