ఐఏఎస్ ఆమ్రపాలికి 1210 గజాల స్థలం కేటాయించిన ప్రభుత్వం

ఐఏఎస్ ఆమ్రపాలి.. ఇటీవలి వరకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన ఆమె.. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ట్రైనీగా తెలంగాణకు వచ్చిన ఆమె.. వరంగల్ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో తరచుగా వార్తల్లో నిలిచేవారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద ఓఎస్డీ‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 1210 గజాల స్థలం కేటాయించింది.

వికారాబాద్‌ శివారులోని కొత్రేపల్లిలో ఆమ్రపాలి తల్లి పద్మావతి పేరిట 4.27 ఎకరాల స్థలం ఉంది. దీనికి అప్రోచ్‌ రోడ్డు లేకపోవడంతో.. రోడ్డు కోసం స్థలం కేటాయించాలని ఆమ్రపాలి ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. రూ.4 లక్షలకు 1210 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.