ఏపీలో తగ్గుతున్న ఇసుక కష్టాలు.. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయో

ఆంధ్రప్రదేశ్‌లో కష్టాలు క్రమంగా తీరుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక లభ్యత తగ్గిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. ఉపాధి లేక కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇది క్రమంతో రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే నదుల్లో వరద ప్రవాహం ఉండటం వల్లే ఇసుక సరఫరా చేయలేకపోతున్నామని, ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

Also Read:

అయితే రాష్ట్రంలో క్రమంగా ఇసుక లభ్యత పెరుగుతోంది. వరదలు తగ్గుముఖం పట్టడం, రీచుల్లో తవ్వకాలు పెరగడంతో ఎక్కువ ఇసుక అందుబాటులోకి వస్తోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఇసుక సరఫరా క్రమంగా పెంచుతోంది. రాష్ట్రంలో ఇసుక విధానం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, వంశధార, నాగావళి నదుల్లో భారీ వరద ప్రవాహం కొనసాగింది. దీంతో రీచ్‌ల్లో ఇసుక తవ్వడం సాధ్యం కాలేదు.

Also Read:

తాజాగా వర్షాకాలం ముగియడం, వరదలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఇసుక తవ్వకాలు వేగవంతం చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 85,122 టన్నులు, శుక్రవారం86,482 టన్నుల ఇసుకను తవ్వితీశారు. పాత నిల్వలు కలుపుకొని రోజుకు 96వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇసుక లభ్యత పెరగడంతో తమకు ఉపాధి లభిస్తుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఇన్నాళ్లుగా కొనసాగిన ఇసుక రాజకీయం ఇకనైనా ముగుస్తుందో? లేదో? చూడాలి.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.