`ఏడు చేపల కథ` హీరో మరో అరాచకం.. సెన్సార్‌ పూర్తి చేసుకున్న `వైఫ్‌,ఐ`

సినిమాలో సెన్సేషన్‌ సృష్టించిన నటుడు . గతంలో తెలుగు తెర మీద కనిపించనంత బోల్డ్‌ క్యారెక్టర్‌తో షాక్‌ ఇచ్చిన అభిషేక్‌, ఈ సినిమాతో తను ఆశించిన విజయం సాధించాడు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ రాకపోయినా కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి.

అయితే ఏడు చేపల కథ ఫీవర్‌ కొనసాగుతుండగానే మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశాడు అభిషేక్‌ రెడ్డి. పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా ఏడు చేపల కథ తరహాలోనే బోల్డ్ కంటెంట్‌తో రూపొందుతోంది. నైఫ్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ వైఫ్‌ అనై ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. బోల్డ్ కంటెంట్‌ కారణంగా ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికేటే వచ్చింది.

Also Read:

ఒకరు ప్రవర్తనతో ఒకరు విసిగిపోయిన భార్యా భర్తల కథతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కుతోంది. అభిషేక్‌ భార్య సాక్షి నిదియా నటిస్తున్న ఈ సినిమాలో కావ్య, సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్టా, అపర్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:

జీఎస్‌ఎస్‌పీ కళ్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు. లక్ష్మీ చరిత ఆర్ట్స్‌, జీఎస్‌ఎస్‌పీకే స్టూడియోస్‌ బ్యానర్‌లపై జీ చరితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.