‘ఏడు చేపల కథ’ని రుచిమరిగారే.. రెండో రోజు షాకింగ్ కలెక్షన్స్

బూతు బొమ్మలకు మార్కెట్‌లో ఎంత గిరాకీ ఉంటుందో ‘ఏడు చేపల కథ’ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తే అర్ధమైపోతుంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌‌లను పక్కాగా ప్రమోట్ చేసుకుని పక్కా అడల్ట్ కంటెంట్స్‌తో బూతు బొమ్మను చూపించబోతున్నాం అని ముందే చెప్పి మరీ థియేటర్స్‌కి రప్పించిన ‘ఏడు చేపల కథ’ చిత్ర యూనిట్ కమర్షియల్‌గా క్లిక్ అయ్యింది.

ఈ సినిమాకి బీభత్సమైన హైప్ రావడంలో A సర్టిఫికేట్ చిత్రాలను ఇష్టపడే అభిమానులు తొలిరోజు థియేటర్స్‌కి క్యూ కట్టారు. ఈ చిత్రాన్ని భారీగా 500 స్క్రీన్స్‌పై విడుదల చేశారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.

Read Also:

ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ.. ‘ఏడు చేపల కథ’ చిత్రాన్ని రూ. 1. 4 కోట్లకు అమ్ముడైంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్‌తో పాటు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో తొలిరోజు 1.9 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే రెండో రోజు మరింత పుంజుకుని 2. 4 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే.. టీజర్, ట్రైలర్‌లు చూసి ఆత్రంగా థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులు థియేటర్ నుండి నీరసంగా బయటకు వస్తున్నారు. టీజర్, ట్రైలర్‌లను చూసి ఏదో ఊహించుకుని వెళ్తే లోపల అన్ని కట్‌లే కనిపించాయి. సినిమా కంటే టీజర్, ట్రైలర్‌లలో బూతు కంటెంట్ ఎక్కువ చూపించారు. రెండు నిమిషాల టీజర్‌లోనే ఇంత చూపిస్తే.. రెండున్నర గంటలు సినిమాలో ఇంకెంత చూపిస్తారో అని ఆత్రంగా వస్తే.. లోపల ఏడు చేపల్లో ఒక్క చేపని కూడా సరిగా చూపించకుండా ఆశ చూపి తూచ్ అనిపించారని తెగ ఫీల్ అయిపోతున్నారు ఈ ‘ఏడు చేపల కథ’ వీరాభిమానులు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.