ఎన్నికల సంస్కర్త, మాజీ సీఈసీ టీఎన్ శేషన్ కన్నుమూత

కేంద్ర మాజీ , ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన (87) ఇకలేరు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆదివారం (నవంబర్ 10) రాత్రి చెన్నైలో కన్నుమూశారు. శేషన్ పూర్తి పేరు తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్. కేంద్ర ఎన్నికల సంఘానికి 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆయన పనిచేశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు పదవిలో ఉన్నారు. తన పదవి కాలంలో శేషన్.. భారత ఎన్నికల ప్రక్రియలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంచలన నిర్ణయాలతో రాజకీయ నేతలను గడగడలాడించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.