ఎన్టీఆర్, బాలకృష్ణ మల్టీస్టారర్‌.. అలా మిస్‌ అయ్యింది!

ఇటీవల టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాల ట్రెండ్‌ బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకే ఫ్యామిలీ హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తే ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారు. ఇప్పటికే అక్కినేని, మెగా ఫ్యామిలీ హీరోలు అలా కలిసి నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నందమూరి హీరోలు మాత్రం అలా కలిసి నటించిన సినిమాలు లేవు. దీంతో నందమూరి హీరోల నుంచి ఓ సాలిడ్‌ మల్టీ స్టారర్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే గతంలోనే నందమూరి హీరోల నుంచి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా జనతా గ్యారేజ్‌. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ పాత్రకు ముందుకు వేరే నటుడిని అనుకున్నారు.

Also Read:

జనతా గ్యారేజ్‌ సినిమాలో మోహన్‌ లాల్ చేసిన పాత్రకు ముందుగా నందమూరి బాలకృష్ణను అనుకున్నారు. అయితే బాలయ్య ఇమేజ్‌, ఫాలోయింగ్ కారణంగా పెద్దగా హీరోయిజం లేని ఆ పాత్ర చేస్తే ఫ్యాన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అన్న అనుమానంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేశారట. దీంతో ఆ క్యారెక్టర్‌ దగ్గరకు వెళ్లింది.

సరసన సమంత, నిత్యా మీనన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఒకవేళ ముందుగా అనుకున్నట్టుగా మోహన్‌లాల్‌ పాత్రను బాలయ్య కనుక చేసి ఉంటే మనం తరహాలోనే ఈ సినిమా కూడా నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా అయ్యేదన్న టాక్‌ వినిపిస్తోంది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.