'ఇంగ్లిష్' మీడియంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తొలిదశలో 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేయాలని భావించినప్పటికీ.. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే విద్యను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Read Also:

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం (నవంబరు 9) నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సరైన వనరులు లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నవంబరు 14న ప్రారంభంకానునన ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంగ్లిష్’ భాషకు సంబంధించి ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

Read Also:

ప్రభుత్వం మొదట జారీచేసిన మార్గదర్శకాలు ఇలా . . .
➦ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి.

➦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1 – 8 తరగతులను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపాలి.

Read Also:

➦ ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే.. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవుల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి.

➦ టీచర్లలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.

➦ ఇంగ్లిష్‌ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి.

Dont Miss:

➦ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ సెంటర్లు, డిస్ట్రిక్ట్‌ ఇంగ్లిష్‌ సెంటర్లను.. డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి.

➦ సంబంధిత ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధించడానికి వీలుగా.. వారికి అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ, హ్యాండ్‌ బుక్స్‌ రూపకల్పన, ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, వారికి అవసరమైన మెటీరియల్‌ను రూపొందించే బాధ్యతను స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ)కి అప్పగించింది.

Read More . .

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.