ఇంకోసారి ముద్దుపెడితే పదాలు కోసేస్తా: బిగ్‌బాస్‌లో రచ్చ

బాలీవుడ్‌ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షోలో గలీస్ పనులు జరుగుతున్నాయి. షోలో కంటెస్టెంట్లుగా ఉన్న పరాస్ చాబ్రా, మహీరా శర్మల మధ్య రొమాన్స్ హద్దులు మీరుతోంది. పరాస్ మాటిమాటికీ మహీరాను ఆట పేరుతో ముద్దు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత గేమ్ షో అయితే మాత్రం మగాడు మాటిమాటికీ మీదకు వస్తుందే ఆడది ఎంతని సహిస్తుంది. అందుకే పరాస్‌కు మహీరా వార్నింగ్ ఇచ్చింది.

ఇంకోసారి ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తే పెదాలు కోసేస్తానని హెచ్చరించింది. గతంలోనూ పరాస్ అనుమతి లేకుండా మహీరా బుగ్గపై ముద్దులు పెడుతుండడంతో ఆమె వద్దని వారించింది. అయినా పరాస్ వినలేదు. దాంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఉదయాన్నే మహీరాను ముద్దు పెట్టందే తాను నిద్రలేవనని గతంలో చాలా సార్లు చెప్పాడు. దాంతో తెల్లారగానే మహీరాకు ముద్దు పెట్టడానికి ఆమె మంచం మీదకు వెళ్తున్నాడు. ఇంతకాలం సహించిన మహీరా ఇక తట్టుకోలేకపోయింది.

READ ALSO:

అందుకే ఇంకోసారి ముద్దు పెడితే పెదాలు కోసేస్తానని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తూ సల్మాన్ ఖాన్ ఎందుకు మౌనం వహిస్తున్నాడో అర్థంకావడంలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆట పేరుతో అనుమతి లేకుండా ముద్దులు పెట్టడాలు, కౌగిలించుకోవడాలు, ఒకే మంచంపై నిద్రపోవడాలు వంటివి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఘటనపై సల్మాన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

READ ALSO:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.