ఆమెకి ఆశ్రయం ఇచ్చారో కటకటాలే.. ఏసీబీ హెచ్చరికలు.. ఎవరో తెలుసా?

భూ సమస్య పరిష్కారం కోసం రూ. 4 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ ఏసీబీకి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. గూడూరుకు చెందిన సురేష్‌ భూ రికార్డులు సరిచేసేందుకు తహసీల్దార్ హసీనాబీ రూ.8 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్నాయి. చివరకు రూ.4 లక్షలకు బేరం కుదుర్చుకుంది. లంచం సొమ్ము తీసుకునేందుకు మధ్యవర్తిని పంపిన సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

సురేష్ నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్న తహసీల్దార్ పంపిన మధ్యవర్తి మహబూబ్‌ బాషాను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. తహసీల్దార్‌ చెప్పడంతోనే డబ్బులు తీసుకునేందుకు వచ్చినట్లు బాషా వెల్లడించడంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్‌‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న హసీనాబీ ఆ రోజు నుంచి పరారీలో ఉన్నారు.

Also Read:

గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ తప్పించుకు తిరుగుతున్నారని.. ఆమెకి ఎవ్వరూ ఆశ్రయం కల్పించవద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆశ్రయం కల్పించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తహసీల్దార్ ఆచూకీ కోసం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పలు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. హసీనాబీ ఆదేశాల మేరకు లంచం తీసుకున్న మహబూబ్‌ బాషాను శనివారం కోర్టులో హాజరు పరచగా ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.