అయోధ్య తీర్పుపై Bollywood ప్రముఖుల స్పందన

శనివారం సుప్రీం కోర్ట్‌ చారిత్రక తీర్పును వెలువరించింది. వంద ఏళ్లకు పైగా నలుగుతున్న అయోధ్య రామ మందిర సమస్యకు పరిష్కారం సూచించింది. వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుమంతించిన కోర్టు, అయోధ్యలోనే మరో ప్రాంతంలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తెలిపింది. ఈ తీర్పును స్వాగతిస్తూ బాలీవుడ్ సినీ ప్రముఖులు ట్వీట్‌లో స్పందించారు.

కాలా ఫేం హ్యూమా ఖురేఫీ ఇక ఈ సమస్యను పక్కన పెట్టి ముందుకు వెళదాం అంటూ ట్వీట్ చేశారు. `ప్రియమైన భారతీయులారా.. అయోధ్య వివాదం విషయంలో సుప్రీ కోర్టు ఈ రోజు వెలువరించిన తీర్పును గౌరవిద్దాం. ఈ గాయలనుంచి కోలుకొని ఒకే దేశంగా ముందుగా సాగేందుకు కలిసినడుద్దాం` అంటూ ట్వీట్‌ చేశారు.

Also Read:

ఇటీవల దేవదాస్‌ సినిమాలో నటించిన బాలీవుడ్‌ నటుడు కునాల్ కపూర్‌ కూడా సుప్రీం తీర్పుపై స్పందించాడు. `ఇది మనం శాతియుతంగా స్పందించాల్సిన సమయం. సున్నితంగా వ్యవహరిస్తూ ఐక్యత కలిగిన భారతదేశ నిర్మాణానికి కృషి చేయాల`ని ట్వీట్ చేశారు.

మరో నటుడు విక్రాంత్ మెస్సీ ఇది నవోదయం అంటూ ఆనందం వ్యక్తం చేశారు `ఎంత గొప్ప ఉదయం. మన భవిష్యత్తు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నా దేశం బలమైన, ఐఖ్యత కలిగిన కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టాలని ప్రార్థిన్నా` అని కామెంట్ చేశారు.

Also Read:

ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ సుప్రీం కోర్టుకు ముస్లిం ప్రజలకు కృతజ్ఙతలు తెలియజేశారు. `ముస్లిం ప్రజలు చూపిస్తున్ ఔదార్యానికి కృతజ్ఞతలు. సహనం వహిస్తున్న హిందువులకు కూడా కృతజ్ఞతలు. భారత దేశం ఇలాగే చెక్కు చెదరకుండా రామ జన్మభూమిగా నిలిచిపోతుంది. జై శ్రీరాం` అంటూ ట్వీట్ చేశారు.

సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ సైతం సుప్రీం తీర్పుపై స్పందించారు. అయోధ్య విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను, గౌరవిస్తున్నాను. అందరు అదే చేయాలని కొరుతున్నా` అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. దర్శక నిర్మాత ఫర్హాన్‌ అక్తర్ కూడా సుప్రీం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు.

Also Read:

సౌత్‌ నుంచి వెళ్లి బాలీవుడ్ లో పాగా వేసిన హీరోయిన్‌ తాప్సీ ఈ తీర్పుపై ఆసక్తికరంగా స్పందించింది. `ఇక అవసరమైన పనులు చేయనివ్వండి. ఇక నైన మన దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విషయాల వైపు సాగుదాం` అంటూ ట్వీట్ చేసింది తాప్సీ. ఎంతో కాలంగా తేలని అయోధ్య విషయంలో ఓ మంచి నిర్ణయాన్ని వెలువరించిన సుప్రీంకు దర్శకుడు మథుర్‌ బండార్కర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.