అయోధ్య తీర్పుపై వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్..!

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం గురించి శనివారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. 2.77 ఎకరాల ఆ భూమిని రామ మందిరం కోసం హిందువులకి అప్పగించాలని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే ముస్లింలకి కూడా 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా నడిచిన వివాదంపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో దేశంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

Read More:

వీరేంద్ర సెహ్వాగ్ సాధారణంగా చమత్కారరీతిలో ట్వీట్స్ చేస్తుంటాడు. కానీ.. అయోధ్య భూమి వివాదం చాలా సున్నితమైనది కావడంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ‘శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్’ అని శ్రీరాముడి ఫొటోని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్‌పై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సెహ్వాగ్‌ని పొగుడుతుంటే.. మరికొందరు చిక్కుల్లో పడతావంటూ హెచ్చరిస్తున్నారు.

Read More:

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ కామెంటేటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ కొనసాగుతున్నాడు. విషయం ఏదైనా.. కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పడంలో ఈ డాషింగ్ ఓపెనర్‌ది ప్రత్యేక శైలి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.