అత్తింట్లో అల్లుడు అనుమానాస్పద మృతి… కారణాలపై పోలీసుల ఆరా

న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు అత్తింటికి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఎల్బీనగర్‌ పరిధిలోని ఎన్‌ఆర్‌నగర్‌కు చెందిన కిన్నెరస్వామి(35) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.అతడికి 10ఏళ్ల క్రితం రామంతాపూర్‌ కామాక్షిపురం ప్రాంతానికి చెందిన రమాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

Also Read:

కొత్త సంవత్సరం రాక సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు కిన్నెరస్వామి మంగళవారం భార్య, పిల్లలతో కలిసి అత్తారింటికి వచ్చాడు. అర్ధరాత్రి వరకు బంధువులతో కలిసి ఆనందంగా గడిపాడు. బుధవారం ఉదయం కుటుంబంతో ఆలయానికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చాడు. కాసేపటికే అతడు అస్వస్థతకు గురికావడంతో అత్తమామలు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

Also Read:

అయితే కిన్నెరస్వామి మృతిపై అతడి కుటుంసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడిని పథకం ప్రకారమే చంపేసి ఉండొచ్చని కిన్నెరస్వామి అన్న శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి అత్తింటి వాళ్తతో తగాదాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.